BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 07:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మురసు తుఫాను నష్టాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:21 PM
4 వీక్షణలు

ఈ నెల 14న జిల్లాలో కేంద్ర బృందం క్షేత్రస్థాయి పర్యటన అన్ని శాఖల అధికారులు వాస్తవాధారిత వివరాలతో సిద్ధంగా ఉండాలి: పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల మురసు తుఫాను కారణంగా జిల్లాలో వివిధ రంగాలకు జరిగిన నష్టాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అధికారులను ఆదేశించారు. ఈ నెల 14వ తేదీన కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి క్షేత్రస్థాయిలో నష్టాలను పరిశీలించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో తుఫాను వల్ల జరిగిన నష్టాలు, చేపట్టిన సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు, నష్టాల అంచనా నివేదికలపై కలెక్టర్ సమీక్షించారు. కేంద్ర బృందం పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రతి శాఖ తమ పరిధిలో జరిగిన నష్టాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నివేదికలు రూపొందించాలని సూచించారు. కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా నష్టాలకు సంబంధించిన ఆధారాలతో వివరాలు సమర్పించాలని తెలిపారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖల అధికారులు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, నీట మునిగిన విస్తీర్ణం, ఉద్యాన పంటల నష్టం, పశుసంపద, మత్స్య రంగానికి జరిగిన నష్టాలను గ్రామాల వారీగా నమోదు చేయాలని ఆదేశించారు. బాధిత రైతుల వివరాలు, పంటల వారీగా నష్టపోయిన విస్తీర్ణం, నష్టాల అంచనాలను సమగ్రంగా పొందుపరచాలని సూచించారు. విద్యుత్, తాగునీటి వ్యవస్థల నష్టాల నమోదు విద్యుత్ శాఖ అధికారులు దెబ్బతిన్న స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, సరఫరాలో అంతరాయాలు, మరమ్మతుల ఖర్చు వివరాలను నివేదికలో పొందుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థలో దెబ్బతిన్న పైపులైన్లు, పంపింగ్ కేంద్రాలు, నీటి సరఫరా పథకాల వివరాలను సేకరించి, పునరుద్ధరణ చర్యలను నమోదు చేయాలని సూచించారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నష్టాలపై ప్రత్యేక నివేదిక గృహ నిర్మాణ శాఖ అధికారులు తుఫాను కారణంగా దెబ్బతిన్న ఇళ్ల వివరాలను గ్రామాల వారీగా సేకరించాలని ఆదేశించారు. పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న గృహాలను వేర్వేరుగా నమోదు చేసి, బాధిత కుటుంబాల వివరాలు, నష్టాల అంచనా, అందించిన సహాయక చర్యలను నివేదికలో పొందుపరచాలని తెలిపారు. మౌలిక సదుపాయాల నష్టాల అంచనా రహదారులు, మురుగునీటి కాలువలు, ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రజా మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను సంబంధిత శాఖల అధికారులు గుర్తించాలని కలెక్టర్ సూచించారు. వాటి పునరుద్ధరణకు అవసరమైన పనులు, అంచనా వ్యయంతో కూడిన నివేదికలను సిద్ధం చేయాలన్నారు. కేంద్ర బృందం పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో అందుబాటులో ఉండాలని, క్షేత్రస్థాయి పరిశీలనకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నష్టాల అంచనాలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని, ఏ ఒక్క ప్రభావిత గ్రామం, బాధిత కుటుంబం వివరాలు కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదని ఆదేశించారు. నిర్ణీత సమయంలో సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులకు సూచించారు.