BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 06 August 2026, 03:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పని కల్పించండి.. ధరలు తగ్గించండి.. జీవనానికి సరిపడా కూలి ఇవ్వండి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 03:58 PM
192 వీక్షణలు

పని కల్పించండి.. ధరలు తగ్గించండి.. జీవనానికి సరిపడా కూలి ఇవ్వండి: సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ డిమాండ్

ముసునూరు, ఆగస్టు 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ పేదలు, కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ ముసునూరు మండల కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ ముసునూరు మండలం సూరేపల్లి గ్రామంలో పల్లెపాము భవాని అధ్యక్షతన ఉపాధి హామీ కూలీల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బక్కయ్య మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తూ విబి గ్రామజీ పథకాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. కూలీలకు పనులు కల్పించకుండా, వేతన బకాయిలు చెల్లించకుండా, అలవెన్సులు ఇవ్వకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

ఎల్‌నీనో ప్రభావంతో వర్షాలు లేక గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే పూర్తి స్థాయిలో ఉపాధి హామీ పనులు కల్పించి, పెండింగ్ వేతనాలను చెల్లించాలని, రోజుకు రూ.700 కూలి, సంవత్సరానికి 200 రోజుల పని, ఇతర అలవెన్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అటవీ భూముల నాలుగో నోటిఫికేషన్‌ను రద్దు చేసి సాగుదారులకు పట్టాలు మంజూరు చేయాలని, ఈ అంశంపై జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించాలని కోరారు. అర్హులైన పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు, పెండింగ్ పింఛన్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతన బకాయిలు చెల్లించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

పంజాబ్‌లో రైతు సమస్యలపై కిసాన్ మహాసభ, జార్ఖండ్‌లో కూలీల సమస్యలపై ఐర్ల జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంఘాల్లో సభ్యులుగా చేరి వాటిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న ముసునూరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో పల్లెపాము భవానితో పాటు రైతులు, కూలీలు, కార్మికులు, గ్రామస్థులు పాల్గొన్నారు.