BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 11 August 2026, 06:37 pm
Posted by : కూనురు మధు

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు క్రీడా పోటీలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
11 Aug, 2026 - 06:37 PM
192 వీక్షణలు

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు క్రీడా పోటీలు

చిట్యాల పట్టణంలోని పీఎం శ్రీ జెడ్ పి హెచ్ ఎస్ చిట్యాలలో ఉన్న భవిత కేంద్రంలో పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల  కోసం మండల స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి పి. సైదానాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. సుశీల ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సైదానాయక్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. గెలుపోటముల కంటే పోటీల్లో పాల్గొనడమే ముఖ్యమని విద్యార్థులను ప్రోత్సహించారు. చిట్యాల మండల పరిధిలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థులకు వారి సామర్థ్యాలకు అనుగుణంగా రన్నింగ్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, బాల్ త్రో, రింగ్ త్రో తదితర పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసాపత్రాలు, లంచ్ బాక్సులు, మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. సుధాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, భవిత ఉపాధ్యాయులు ఐఈఆర్‌పీ ఏ. గీత, స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఎం. సౌమ్య , ఏ. చైతన్య , ఫిజియోథెరపిస్ట్ శృతి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.