BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 04:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పర్వతాపురంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల మధ్య పోటీ.. ఎవరికి అధిష్ఠానం అండ!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 04:12 PM
45 వీక్షణలు

 మంత్రి ఆశీస్సుల పేరుతో ఇద్దరి నామినేషన్లు.. అయోమయంలో గ్రామ ప్రజలు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో డిసెంబర్ 2వ తేదీన జరగనున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా విచిత్ర పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో గ్రామంలో రాజకీయ గందరగోళం ఏర్పడింది. ఒకవైపు మంత్రి ఆశీస్సులు తనకే ఉన్నాయంటూ బొర్రా నాగమల్లేశ్వరి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయగా, మరోవైపు మిద్దె సత్యనారాయణ అలియాస్ అడవి సత్యం సైతం కూటమి అభ్యర్థిగా భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరూ తమకు పార్టీ పెద్దల మద్దతు ఉందన్న ధీమాతో ముందుకు రావడంతో అసలు పార్టీ అధికారిక అభ్యర్థి ఎవరు అనే అంశంపై గ్రామస్థుల్లో అయోమయం నెలకొంది. గెలుపు అవకాశాలను ముందుగానే అంచనా వేసి, గెలిచే అభ్యర్థికి పార్టీ మద్దతు ప్రకటించి ఎన్నికల బరిలో నిలపాల్సిన పరిస్థితుల్లో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీ పడితే ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని, దీని ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని అభ్యర్థుల విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని గ్రామ రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నామినేషన్ కార్యక్రమంలో జెడ్పీటీసీ తెళ్లూరి శేఖర్ పాల్గొన్నారు.