BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 04:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పర్వతాపురంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి మిద్దె శివాజీ నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 04:12 PM
25 వీక్షణలు

వందలాది మంది కార్యకర్తలతో భారీ ప్రదర్శనగా వెళ్లి నామినేషన్ దాఖలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మిద్దె శివాజీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి నరసింహారావుపాలెం గ్రామ సచివాలయానికి చేరుకుని ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.

ఈ సందర్భంగా మిద్దె శివాజీ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తానని పేర్కొన్నారు. గ్రామంలో తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సహకారంతో ఎన్నికల్లో విజయం సాధించి పర్వతాపురం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.