BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 19 June 2026, 02:33 pm
Posted by : కూనురు మధు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
19 Jun, 2026 - 02:33 PM
265 వీక్షణలు

చిట్యాలలో  20 లక్షల వ్యయంతో అస్పిరేషనల్ టాయిలెట్' నిర్మాణానికి  శ్రీకారం

పర్యావరణ పరిరక్షణతో పాటు పట్టణంలో పారిశుద్ధ్య మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. కేరళలో నిర్వహించిన వనమహోత్సవంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో పచ్చదనం పెంపునకు శ్రీకారం చుట్టిన ఆయన, అనంతరం రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన అస్పిరేషనల్ టాయిలెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ​మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం
​వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే వేముల వీరేశం స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు. నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే పచ్చదనం పెంపు అత్యంత అవసరం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరిత కార్యక్రమాలను ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. ఆధునిక వసతులు
​పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు మెరుగైన పారిశుద్ధ్య వసతులు కల్పించాలనే ఉద్దేశంతో రూ.20 లక్షల వ్యయంతో అస్పిరేషనల్ టాయిలెట్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి, పారిశుద్ధ్యం, పచ్చదనం పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన కొనియాడారు. ​చిట్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.