BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడులో సాయి ప్రణీత స్కూల్‌పై తల్లిదండ్రుల ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 10:47 PM
25 వీక్షణలు

హాస్టల్‌లో కనీస సౌకర్యాలు లేవు.. విద్యార్థిని రాత్రివేళ గదిలో బంధిస్తున్నారని ఆవేదన పదో తరగతి మధ్యలో టీసీ తీసుకెళ్లాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదు ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని సాయి ప్రణీత హైస్కూల్ యాజమాన్యంపై పదో తరగతి విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. నూజివీడు మండలం నూకొండపల్లి గ్రామానికి చెందిన మల్లవల్లి శివయ్య కుమారుడు సాయి ప్రణీత హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల వసతి గృహంలో తమ కుమారుడికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, ఒక తరగతి గదిలో ఉంచి రాత్రి సమయంలో బయటకు రాకుండా తలుపులు వేసి ఉంచుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడికి ఆరోగ్య సమస్య ఉందని, రాత్రి సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు రావాల్సి వచ్చినా తలుపులు తెరవడం లేదని వారు తెలిపారు. ఎన్నిసార్లు పిలిచినా వెంటనే స్పందించకుండా సుమారు 20 సార్లు పిలిస్తే ఒక్కసారి మాత్రమే వచ్చి తలుపులు తెరిచే పరిస్థితి ఉందని ఆరోపించారు. ఈ పరిస్థితులను భరించలేక తమ కుమారుడిని వసతి గృహం నుంచి తొలగించి, రోజూ ఇంటి నుంచి వచ్చి వెళ్లే విద్యార్థిగా కొనసాగించాలని పాఠశాల యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు. అయితే దీనికి యాజమాన్యం స్పందిస్తూ మీ కుమారుడు తమకు అవసరం లేదని, టీసీ తీసుకెళ్లాలని ఒత్తిడి చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల నుంచి పంపిస్తే అతని భవిష్యత్తు దెబ్బతింటుందని, కనీసం పరీక్షలు పూర్తయ్యే వరకు చదువుకునే అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా విద్యార్థికి పాఠశాల నుంచి సరైన భోజనం అందించకుండా బయట హోటల్ నుంచి ఆహారం తెప్పిస్తున్నారని, దీనివల్ల తమ కుమారుడి ఆరోగ్యం దెబ్బతిన్నదని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ సమస్యను పరిష్కరించాల్సిన యాజమాన్యం తిరిగి తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని వారు వాపోయారు. తమ కుమారుడిని అదే పాఠశాలలో డే స్కాలర్‌గా కొనసాగించేందుకు అవకాశం కల్పించి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు సాయి ప్రణీత హైస్కూల్‌కు హాస్టల్ నిర్వహణకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు ఉన్నాయా, విద్యార్థులకు వసతి గృహంలో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారా అనే అంశాలపై అధికారులు విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. తల్లిదండ్రులు చేసిన ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం వివరణ, అధికారుల విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.