BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఓటర్ల తొలగింపుపై పీడీఎస్‌యూ నిరసన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 09:26 PM
6 వీక్షణలు

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి ఓటర్ల తొలగింపుపై పీడీఎస్‌యూ నిరసన

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడిలో పీడీఎస్‌యూ కమిటీ ఆధ్వర్యంలో ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌) ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారని నాని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

పీడీఎస్‌యూ చింతలపూడి నగర అధ్యక్షుడు ఎస్‌డీ రయాన్ మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఓటర్ల పేర్ల తొలగింపునకు సంబంధించి జ్ఞానేశ్ కుమార్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేసే వరకు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ ధర్నాలో కే. రాకేష్, మణికంఠ, వేణు, తంబి, ఎస్‌కే రియాజ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.