BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 04:20 am
Posted by : K MAHESH

వినికిడి లోపం ఉన్నవారికి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 04:20 AM
19 వీక్షణలు

కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్స ఖర్చు తగ్గించి పేదలకు చేరువ చేయాలి.. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్థవంతమైన స్క్రీనింగ్ వ్యవస్థ ఉండాలి: ఎంపీ డాక్టర్ కడియం కావ్య

హనుమకొండ: వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి అత్యాధునిక వైద్య సాంకేతికతతో మెరుగైన చికిత్స అందుబాటులోకి రావాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. ముఖ్యంగా కాక్లియర్ ఇంప్లాంట్ వంటి ఖరీదైన చికిత్సల వ్యయాన్ని తగ్గించి పేద, మధ్యతరగతి కుటుంబాలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వైద్య రంగంలో నిరంతర పరిశోధనలు చేపట్టడంతో పాటు వ్యాధుల మూలకారణాలను గుర్తించడం, ముందస్తు వ్యాధి నిర్ధారణకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులకు పిలుపునిచ్చారు.

హనుమకొండ బాలసముద్రంలోని సేవకా రీజెన్సీ, రాయల్ డెక్కన్ హోటల్స్‌లో అపర్ణ ఈఎన్‌టీ హాస్పిటల్, అపర్ణ రాయ్ ఈఎన్‌టీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఏఓఐ తెలంగాణ సహకారంతో నిర్వహించిన ‘సీఐ ఫ్రంటియర్స్–2026’ సదస్సుకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికత, వినికిడి లోపానికి అందిస్తున్న చికిత్సలు, ప్రజారోగ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆమె మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వరంగల్ వైద్య రంగానికి విశేష సేవలందించిన సీనియర్ వైద్యులు, నిపుణులు ఈ ప్రాంతంలో ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. సీనియర్ వైద్యుల అనుభవం, మార్గదర్శకత్వం యువ వైద్యులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వైద్యులు తమ అనుభవాన్ని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

ప్రస్తుతం అనేక వ్యాధులకు వాటి లక్షణాల ఆధారంగా చికిత్స అందిస్తున్నప్పటికీ, వ్యాధి అసలు కారణాలను గుర్తించి సమర్థవంతమైన పరిష్కారాలు కనుగొనే దిశగా వైద్య పరిశోధనలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రోగులకు తాత్కాలిక ఉపశమనం కల్పించడమే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే చికిత్సా విధానాల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. పర్యావరణ కాలుష్యం, ఆహార కల్తీ, ప్లాస్టిక్ వినియోగం, మైక్రోప్లాస్టిక్స్ వంటి అంశాలు ప్రజల ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావాలపై కూడా వైద్య నిపుణులు విస్తృతంగా పరిశోధనలు చేయాలని సూచించారు.

క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం అత్యంత కీలకం

క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వ వైద్య వ్యవస్థలో క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని, దీనివల్ల బాధిత కుటుంబాలతో పాటు ప్రభుత్వంపైనా ఆర్థిక భారం పడుతోందని వివరించారు. అదే వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.

పార్లమెంటరీ స్థాయి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిటీలో సభ్యురాలిగా ఉన్న తాను ఈ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రజలకు వాస్తవంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల్లోనూ గొంతు క్యాన్సర్ వంటి వ్యాధులు కనిపిస్తున్న నేపథ్యంలో క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, ముందస్తు పరీక్షలు నిర్వహించడం, నివారణ చర్యలు చేపట్టడం వంటి అంశాల్లో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్స ఖర్చు తగ్గించాలి

వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్స ఎంతో ఉపయోగకరమని ఎంపీ తెలిపారు. అయితే ఈ చికిత్స ఖరీదైనది కావడంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రైవేటు వైద్య రంగంలో ఈ చికిత్సకు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుండగా, ప్రభుత్వ వైద్య వ్యవస్థలో ఒక్కో కేసుకు సుమారు రూ.6 లక్షల వ్యయం అవుతోందని వివరించారు.

ముఖ్యంగా పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్స ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ ఒక్క చిన్నారి కూడా ఈ వైద్య అవకాశాన్ని కోల్పోకూడదని అన్నారు. భవిష్యత్తులో ఈ చికిత్స ఖర్చును మరింత తగ్గించే మార్గాలను అన్వేషించాలని, ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పేద కుటుంబాలకు సులభంగా చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు.

వైద్య రంగంలో ఆధునిక సాంకేతికతను సామాన్య ప్రజలకు చేరువ చేయడం, వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజారోగ్యాన్ని మరింత మెరుగుపరచవచ్చని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అపర్ణ ఈఎన్‌టీ హాస్పిటల్, అపర్ణ రాయ్ ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ మోహన్ కామేశ్వరన్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సుదీప్, డాక్టర్ ద్వారకనాథ్, డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ రణవీర్ సింగ్, డాక్టర్ ఏకనాథం తదితరులు పాల్గొన్నారు.