BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 03:31 pm
Posted by : PAGADALA DEVAIAH

ప్రభాత్ నగర్ పార్కులో గేటు నిర్మాణానికి అనుమతించేది లేదు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
06 Nov, 2026 - 03:31 PM
11 వీక్షణలు

-పార్కు స్థలాన్ని కాపాడాలని జోనల్ కమిషనర్‌కు ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి 

ప్రభాత్ నగర్ పార్కులో గేటు నిర్మాణానికి అనుమతించేది లేదు – పార్కు స్థలాన్ని కాపాడాలని జోనల్ కమిషనర్‌కు ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినతి.

ఎల్బీనగర్ నవంబర్ 06/ఎన్ టుడే న్యూస్..

కాలనీవాసుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని పార్కు స్థలానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచన.

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురి డివిజన్ ప్రభాత్ నగర్ కాలనీ పార్కులో గేటు నిర్మాణం చేపడుతున్నారనే కాలనీవాసుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  స్పందించారు. నిన్న మార్నింగ్ వాక్‌లో భాగంగా ప్రభాత్ నగర్ కాలనీ పార్కును సందర్శించిన ఎమ్మెల్యే గారు అక్కడి పరిస్థితులను పరిశీలించి కాలనీవాసుల అభ్యంతరాలను తెలుసుకున్నారు.ఈ నేపథ్యంలో ఈరోజు ప్రభాత్ నగర్ కాలనీవాసులతో కలిసి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో ని వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి  మాట్లాడుతూ ప్రభాత్ నగర్ కాలనీ లేఅవుట్‌లో భాగంగా ఈ స్థలాన్ని ఓపెన్ స్పేస్‌గా కేటాయించడం జరిగిందని తెలిపారు.ఎన్నో సంవత్సరాలుగా ఈ పార్కులో చిన్నారులు,పెద్దలు,మహిళలు ఉదయం,సాయంత్రం వాకింగ్‌తో పాటు యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు.అలాంటి పార్కులోకి హాస్పిటల్ నుంచి ప్రవేశించేందుకు గేటు ఏర్పాటు చేయడం వల్ల పార్కు వినియోగానికి కాలనీవాసుల ప్రశాంతతకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని తెలిపారు.హాస్పిటల్‌కు గేటు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటే పార్కు స్థలానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గంలో గేటు ఏర్పాటు చేయాలని సూచించారు.గతంలో టీమ్స్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  26 అంతస్తుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు.అప్పట్లోనే హాస్పిటల్ ప్రాంగణంలో పార్కు,రిజర్వాయర్,సబ్‌స్టేషన్,పోలీస్ స్టేషన్ వంటి మౌలిక సదుపాయాల నిర్మాణాల కోసం జీవో తీసుకురావడం జరిగిందని తెలిపారు.అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ 26 అంతస్తులకు బదులుగా కేవలం 13 అంతస్తులకే నిర్మాణాలు చేపట్టిందని విమర్శించారు.ప్రభాత్ నగర్ పార్కు కాలనీవాసుల కోసం కేటాయించిన ఓపెన్ స్పేస్ అని,దాని స్వరూపాన్ని మార్చే విధంగా ఎలాంటి నిర్మాణాలు లేదా గేట్ల ఏర్పాటు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పార్కు స్థలాన్ని కాపాడుకోవడానికి కాలనీవాసులతో కలిసి పోరాడుతామని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్కు స్థలానికి నష్టం కలగనివ్వబోమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి,తోట మహేష్ యాదవ్,చంద్రశేఖర్ రెడ్డి,త్రివేది,పవన్,జయశ్రీ,గట్టు శీను, రమణారెడ్డి, కాలనీ అధ్యక్షులు బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.