BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం
Date of Publish : 09 October 2026, 04:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు సహకరించండి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Oct, 2026 - 04:40 PM
2 వీక్షణలు

మంత్రి నారా లోకేష్‌కు ప్రఖ్యాత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి విజ్ఞప్తి

అమరావతి: రాజధాని అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందించాలని ప్రఖ్యాత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి కోరారు. ఈ మేరకు ఆమె తన తండ్రి అశోక్‌తో కలిసి శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిశారు.

ఇటీవల జరిగిన చెస్ ఒలింపియాడ్‌–2026 మహిళల విభాగంలో భారత జట్టు కాంస్య పతకం సాధించడంతోపాటు, వ్యక్తిగత విభాగంలో బోర్డు–1పై కోనేరు హంపి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఈ విజయాల పట్ల మంత్రి నారా లోకేష్ ఆమెను అభినందించారు.

అమరావతిలో చెస్ అకాడమీని ఏర్పాటు చేయడం ద్వారా చదరంగ క్రీడను మరింత ప్రోత్సహించడంతోపాటు, ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించేందుకు అవకాశం ఉంటుందని కోనేరు హంపి వివరించారు. అకాడమీ ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందించాలని మంత్రిని కోరారు.

కోనేరు హంపి విజ్ఞప్తిపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. చెస్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అమరావతిలో చదరంగ క్రీడ అభివృద్ధికి ఈ ప్రతిపాదన దోహదపడే అవకాశం ఉంది.