మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షుడిగా పూదరి తిరుపతి
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షుడిగా ఎన్నికైన పూదరి తిరుపతికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పూదరి తిరుపతికి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం పనిచేస్తూ INTUCను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
కార్మికుల హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించి వారి సమస్యలను సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్ సుద్దమల్ల హరికృష్ణ, నాయకులు రమణ తదితరులు పాల్గొన్నారు.