లక్షెట్టిపేటలో దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
తెలంగాణ
లక్షెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో శ్రీ సాయి గణేష్ భక్తమండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్లను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్‌రావు ఆవిష్కరించారు.
అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 21, 2026 వరకు ఆశ్వయుజ పాడ్యమి నుంచి విజయదశమి వరకు ఈ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షెట్టిపేటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది.