BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 04:26 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కంకణంపాడు సర్పంచ్ అభ్యర్థిగా పొట్టేళ్ల బాలయ్య ఖరారు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / వెలిగండ్ల
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
14 Nov, 2026 - 04:26 PM
17 వీక్షణలు

వైఎస్సార్సీపీ నాయకులతో సమావేశమైన కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్.. పార్టీ అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపు

వెలిగండ్ల: మండలంలోని కంకణంపాడు పంచాయతీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఉదయం కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీకి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ అభ్యర్థి ఎంపిక తదితర విషయాలను నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సమావేశంలో చర్చల అనంతరం కంకణంపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పొట్టేళ్ల బాలయ్య పేరును దద్దాల నారాయణ యాదవ్ ఖరారు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించుకోవాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరిస్తూ పార్టీ అభ్యర్థి విజయానికి తమ వంతు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎలికా రమణయ్య, మారం వెంకటేశ్వరరెడ్డి, వీరంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పొట్టేళ్ల నడిపి కొండయ్య, మల్లెబోయిన తిరుపతయ్య, రాచగుల్ల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.