BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 07:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పుట్రేల ప్రభుత్వ పాఠశాలకు ప్రింటర్ అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 07:47 PM
53 వీక్షణలు

విద్యాభివృద్ధికి నల్లగుండ్ల లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చేయూత

ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 17: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి చేయూతనందించాలనే లక్ష్యంతో నల్లగుండ్ల లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ (NLR Helping Hands) మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రింటర్‌ను అందజేశారు. ట్రస్ట్ తరఫున నల్లగుండ్ల అంజిరెడ్డి స్వయంగా పాఠశాలకు చేరుకుని ప్రింటర్‌ను అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉపాధ్యాయులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ సహాయాన్ని అందించినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. పాఠశాలలో విద్యా సంబంధిత పనులు, పత్రాల ముద్రణ తదితర అవసరాలకు ప్రింటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది ట్రస్ట్ సేవలను అభినందించారు. పాఠశాల అవసరాన్ని గుర్తించి ప్రింటర్ అందించిన నల్లగుండ్ల లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్‌కు, ట్రస్ట్ చైర్మన్ నల్లగుండ్ల వెంకటరెడ్డికి, కార్యక్రమంలో భాగస్వామిగా నిలిచిన నల్లగుండ్ల అంజిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, విద్యార్థుల అభ్యున్నతికి తమ వంతు సహకారం అందించడం ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధిలో భాగస్వాములవుతూ, విద్యారంగానికి మరింత తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సేవే లక్ష్యం.. సహాయమే మార్గం.. సమాజ అభ్యున్నతే ధ్యేయంగా నల్లగుండ్ల లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు సాగుతోంది.