గుంటూరులో వ్యభిచార ముఠా గుట్టురట్టు.
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
నిర్వాహకురాలితో సహా ఐదుగురు అరెస్ట్
గుంటూరు నగరంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. వాట్సాప్ ద్వారా మహిళల ఫొటోలను పంపుతూ విటులను ఆకర్షిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం.
దాడి సమయంలో నిందితుల నుంచి ఐదు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యభిచార కార్యకలాపాల నిర్వహణలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.