దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా
తెలంగాణ సినిమా ధియేటర్ కార్మికులకు దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా
హైద్రాబాద్/ఎన్ టుడే న్యూస్.
తెలంగాణ రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌లలో పనిచేస్తున్న కార్మికులకు దసరా పండుగ సందర్భంగా బోనస్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లలో అనేక మంది కార్మికులు, సిబ్బంది సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. వీరిలో టికెట్ సిబ్బంది, బుకింగ్ క్లర్కులు, గేట్ సిబ్బంది, ప్రొజెక్షన్/టెక్నికల్ సిబ్బంది, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, క్యాంటీన్ సిబ్బంది, పార్కింగ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
సినిమా థియేటర్ల నిర్వహణలో వీరి పాత్ర ఎంతో ముఖ్యమైనది. అయినప్పటికీ అనేక మంది కార్మికులకు పండుగల సందర్భంగా తగిన ఆర్థిక ప్రోత్సాహకాలు, బోనస్‌లు అందడం లేదని మా దృష్టికి వస్తోంది.
ప్రస్తుతం దసరా పండుగ సందర్భంగా కార్మికులు మరియు వారి కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకునేందుకు వీలుగా, రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న అర్హులైన కార్మికులకు చట్టపరంగా వర్తించే బోనస్/పండుగ బోనస్‌ను చెల్లించేలా కార్మిక శాఖ తరఫున తగిన ఆదేశాలు మరియు సూచనలు జారీ చేయాలని కోరుతున్నాము.
తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ మారన్నా మాట్లాడుతూ
సినిమా థియేటర్లలో పనిచేస్తున్న కార్మికులకు వర్తించే కార్మిక చట్టాలు అమలు అవుతున్నాయా లేదా పరిశీలించాలి.
అర్హులైన కార్మికులకు బోనస్ చెల్లింపు జరుగుతున్నదీ లేదో తనిఖీ చేయాలి.
కార్మికులకు జీతాలు, పని గంటలు, సెలవులు, ఓవర్‌టైమ్, బోనస్ తదితర చట్టబద్ధమైన హక్కులు అందేలా చర్యలు తీసుకోవాలి.
బోనస్ చెల్లించని థియేటర్లపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి.
దసరా పండుగకు ముందుగానే అర్హులైన కార్మికులకు బోనస్ అందేలా సంబంధిత యాజమాన్యాలకు సూచనలు ఇవ్వాలి.
సినిమా థియేటర్ కార్మికులు కూడా సమాజంలో ఒక ముఖ్యమైన శ్రామిక వర్గం. వారి కృషిని గుర్తించి పండుగ సమయంలో వారికి ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వారి కుటుంబాల్లో ఆనందాన్ని పెంచవచ్చు.
కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌లలో పనిచేస్తున్న అర్హులైన కార్మికులకు దసరా సందర్భంగా చట్టప్రకారం లభించాల్సిన బోనస్‌ను సకాలంలో చెల్లించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అవసరమైన తనిఖీలు నిర్వహించి, కార్మికులకు న్యాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ ముఖ్య ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు ఈ కార్యక్రమానికి సినిమా ధియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అండ్ మారన్న ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి జే కుమారస్వామి ట్రాన్స్పోర్ట్ యూనియన్ రాష్ట్ర నాయకులు కే అజయ్ బాబు సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కే అరుణ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి పుల్లారావు రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి కమలాకర్ గౌడ్. మురళి. యాదగిరి. చలం. రాజు. నాగేందర్.భరత్.ప్రదీప్. సుధాకర్. వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు.