ఏపీలో వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు
ద్రోణి, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో సోమవారం వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
గురువారం (15-10-2026) మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడకూడదని హెచ్చరించింది.