రామయ్యకు పాఠశాలలో ప్రవేశం.. కుటుంబానికి ఇంటి పట్టా అందజేత
ఆంధ్రప్రదేశ్
/
నెల్లూరు
నెల్లూరు: మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రామయ్యను నెల్లూరులోని ఏపీటీడబ్ల్యుఆర్‌ఎస్ బాలుర పాఠశాలలో చేర్పించినట్లు బీజేపీ కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు మేకపాటి మాల్యాద్రి నాయుడు తెలిపారు.
పాఠశాలలో విద్యార్థికి అవసరమైన విద్య, భోజనం, దుస్తులు, ఇతర మౌలిక సదుపాయాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రామయ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ఇదే క్రమంలో దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో రామయ్య కుటుంబానికి ఇంటి పట్టాను అందించినట్లు తెలిపారు. దుత్తలూరు తహసీల్దార్ యనమల నాగరాజు కుటుంబ సభ్యులకు ఇంటి పట్టాను అందజేశారు.
రామయ్యకు, ఆయన కుటుంబానికి సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు, ఇతరులకు మేకపాటి మాల్యాద్రి నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రామయ్య కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.