చార్‌ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు..
53 లక్షలు దాటిన యాత్రికుల సంఖ్య
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది కొనసాగుతున్న చార్‌ధామ్ యాత్రకు భక్తుల రాక భారీగా పెరిగింది. ఇప్పటివరకు నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలను కలిపి 53,23,401 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇందులో బద్రీనాథ్ క్షేత్రాన్ని సుమారు 18.10 లక్షల మంది, కేదార్‌నాథ్‌ను 15.57 లక్షల మంది దర్శించుకున్నారు. గంగోత్రికి 8.41 లక్షల మంది, యమునోత్రికి 7.50 లక్షలకు పైగా భక్తులు వెళ్లారు.
గతేడాది ఇదే సమయానికి నాలుగు ధామ్‌లను కలిపి సుమారు 46 లక్షల మంది మాత్రమే యాత్రకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
మరోవైపు, హేమకుండ్ సాహిబ్‌ను కూడా ఇప్పటివరకు 3.52 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. యాత్రికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత, సౌకర్యాల కోసం అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.