BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 08:47 pm
Posted by : కూనురు మధు

25 ఏళ్లుగా తాగునీరు అందిస్తున్న వీధి నల్లా తొలగింపు.. స్థానికుల ఆవేదన

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
07 Nov, 2026 - 08:47 PM
12 వీక్షణలు

లీకేజీకి మరమ్మతులు చేయకుండా నల్లా కనెక్షన్ తొలగించడంపై అసంతృప్తి

చిట్యాల (ఎన్ టుడే న్యూస్): గత 25 ఏళ్లుగా తాగునీరు అందిస్తున్న వీధి నల్లా కనెక్షన్‌ను అధికారులు తొలగించడంపై నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఆరో వార్డు వెంకటాపురం వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి నల్లా లీకేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఫిర్యాదు చేయగా, మరమ్మతులు చేపట్టకుండా నల్లా కనెక్షన్‌ను శాశ్వతంగా తొలగించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత 25 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చిన వీధి నల్లాను అకస్మాత్తుగా తొలగించడంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ గురులింగంను వివరణ కోరగా, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఉన్నందున వీధిలోని నల్లా కనెక్షన్‌ను తొలగించాలని కలెక్టర్ ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.

అయితే, లీకేజీ సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు అందుకు బదులుగా ప్రజలకు ఉపయోగపడుతున్న వీధి నల్లా కనెక్షన్‌నే తొలగించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇన్నేళ్లుగా ప్రజలకు తాగునీరు అందిస్తున్న నల్లాను తొలగించకుండా, లీకేజీ సమస్యకు ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ పాండిరి గీతా రమేష్, కమిషనర్ గురులింగం స్పందించి వీధి నల్లా సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.