వీరిశెట్టిగూడెం గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌కు వినతి
చింతలపూడి: చింతలపూడి శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్‌ను కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చింతలపూడిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి గ్రామ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా వీరిశెట్టిగూడెం గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ముఖ్యంగా స్మశానవాటిక అభివృద్ధి, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామ సమస్యలను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హామీ ఇచ్చినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీరిశెట్టిగూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెక్కల మల్లికార్జునరావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.