పట్టాల సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యేను కలిసిన బుచ్చిరెడ్డిపల్లి గ్రామ ప్రతినిధులు
నర్సంపేట: బుచ్చిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు నర్సంపేట ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పట్టాల సమస్యపై ఎమ్మెల్యేతో చర్చించినట్లు గ్రామ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా పట్టాల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరినట్లు పేర్కొన్నారు. అలాగే ఆర్డీవో, ఎంపీడీవోతో కూడా సమస్యపై చర్చించినట్లు తెలిపారు. పట్టాల విషయంపై త్వరలో చర్యలు తీసుకుని లబ్ధిదారులకు పట్టాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు గ్రామ ప్రతినిధులు వెల్లడించారు.
అదేవిధంగా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాలపై కూడా ఎమ్మెల్యేతో చర్చించినట్లు తెలిపారు. గ్రామంలో మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని కోరినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భద్రమబాహుసింగ్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలాజీ, గ్రామ పెద్దలు గుగులోతు తారాసింగ్, భూక్య భిక్షం, రాజు, వార్డు సభ్యులు హుస్సేన్, లక్ష్మణ్, యువ నాయకులు జగన్, రమేష్, దేవేందర్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.