పరకాల ఇందిరా మహిళా డెయిరీ లేఅవుట్‌పై సమీక్ష
అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే, కలెక్టర్
హనుమకొండ, ఎన్‌టుడే న్యూస్: దామెర మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న పరకాల ఇందిరా మహిళా డెయిరీ లేఅవుట్, డిజైన్‌పై హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పరకాల ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి డెయిరీ ఏర్పాటుకు సంబంధించిన లేఅవుట్, డిజైన్ తదితర అంశాలపై చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులు, శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై అధికారులతో సమీక్షించారు.
డెయిరీ ఏర్పాటుకు సంబంధించిన పనులను సమన్వయంతో చేపట్టి, ప్రాజెక్టు ఉద్దేశాలు నెరవేరేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని డెయిరీ లేఅవుట్, డిజైన్‌కు సంబంధించిన అంశాలపై తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు.