ఒంగోలు బైపాస్‌పై రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
ఒంగోలు: నేషనల్ హైవే బైపాస్‌పై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి మద్దిపాడు వైపు వెళ్తున్న ఆటో బైకును ఢీకొన్న ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఆటోను కొత్తగా కొనుగోలు చేసి బయటకు తీసుకువస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు ఆటో యజమాని తెలిపినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.