ఇసుకదర్శిలో రూ.7.4 కోట్లతో రహదారి పనులకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్
మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శి గ్రామంలో రూ.7.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారి పనులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని ప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి అనగాని ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా మరిన్ని నిధులు కేటాయించి గ్రామాల్లో రహదారులు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు.