BREAKING
thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు
Date of Publish : 30 September 2026, 08:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

న్యాయవాదిపై రౌడీషీట్‌.. నిరసనగా తిరువూరు న్యాయవాదుల విధుల బహిష్కరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Sep, 2026 - 08:32 PM
2 వీక్షణలు

తిరువూరు: విజయవాడకు చెందిన సీనియర్ న్యాయవాది ఓగ్గు గవాస్కర్‌పై పోలీసులు రౌడీషీట్‌ ఓపెన్ చేయడాన్ని నిరసిస్తూ తిరువూరు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు తిరువూరు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

న్యాయవాదులపై అక్రమ కేసులు నమోదు చేయడం, రౌడీషీట్లు తెరవడం వంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదుల హక్కులు, విధుల పరిరక్షణకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. న్యాయవాదులపై ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సంకురాత్రి జనార్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి కృష్ణారెడ్డి, కార్యదర్శి కనపర్తి రాంబాబుతో పాటు సీనియర్ న్యాయవాదులు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.