BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రమణక్కపేటలో సీసీ రోడ్డుకు రూ.25 లక్షలు మంజూరు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 10:27 PM
18 వీక్షణలు

 సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ పోరాటంతో రహదారి సమస్యకు పరిష్కారం మండల కార్యదర్శి వేముల బక్కయ్య

రమణక్కపేట, నవంబర్ 17: ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్య పరిష్కారానికి అడుగులు పడ్డాయని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ మండల కార్యదర్శి వేముల బక్కయ్య తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం, అధికారులకు అందించిన వినతుల ఫలితంగా రహదారి నిర్మాణానికి రూ.25 లక్షల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 171/2 ఆర్ అండ్ బి రోడ్డు నుంచి ఆర్సీఎం చర్చి వరకు ఉన్న పంచాయతీ రహదారిని కొందరు ఆక్రమించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారి ఇరుకుగా మారడంతో ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు సైతం సజావుగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడం కష్టంగా మారింది. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై మూడు నెలల క్రితం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పార్టీ తరఫున వినతిపత్రం అందజేసినట్లు బక్కయ్య తెలిపారు. రహదారి ఆక్రమణలను తొలగించి సీసీ రోడ్డు నిర్మించాలని, ఇరువైపులా మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్వేయర్ తమ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి రహదారికి సంబంధించిన ఆక్రమణలను గుర్తించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆక్రమణలు తొలగించి సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి రహదారి నిర్మాణానికి రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయని, రహదారికి ఇరువైపులా డ్రైనేజీ కాలువలు కూడా నిర్మిస్తామని అధికారులు వెల్లడించినట్లు బక్కయ్య పేర్కొన్నారు. ఈ నిధుల మంజూరు, అధికారుల హామీ పార్టీ ప్రజా పోరాటానికి లభించిన ఫలితమని ఆయన అన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారిని ఎన్నుకోవాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటును అమ్ముకోవద్దని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. ప్రజల సమస్యలపై పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులకు, గ్రామస్తులకు, ప్రజలకు పార్టీ తరఫున విప్లవ వందనాలు తెలియజేస్తున్నట్లు బక్కయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు మల్లెపాము భవాని, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు

.