BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 06:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పల్లెదొడ్డిలో సర్పంచ్ పదవికి రూ.32.50 లక్షల బిడ్

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Nov, 2026 - 06:08 PM
26 వీక్షణలు

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పల్లెదొడ్డి గ్రామంలో సర్పంచ్ పదవిని రూ.32.50 లక్షలకు వేలం వేసినట్లు ప్రచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలోని మారెమ్మ ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చే ఉద్దేశంతో గ్రామ పెద్దల సమక్షంలో ఈ వేలం నిర్వహించినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో బోయ ఖాసీం రూ.32.50 లక్షలకు బిడ్ దాఖలు చేసినట్లు గ్రామస్తుల మధ్య చర్చ జరుగుతోంది. అనంతరం ఆయనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారంపై అధికారికంగా ధృవీకరణ రావాల్సి ఉంది. సర్పంచ్ పదవిని వేలం ద్వారా నిర్ణయించడం ఎన్నికల నిబంధనలకు అనుగుణమా కాదా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై ఎన్నికల అధికారులు స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.