BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 04:15 am
Posted by : K MAHESH

ఇబ్రహీంపట్నంలో వైభవంగా సదర్‌ సమ్మేళనం

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 04:15 AM
19 వీక్షణలు

యాదవుల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీక సదర్‌ వేడుకలు.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం: యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన సదర్‌ సమ్మేళనం వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సాగిన ఈ వేడుకలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. దున్నపోతుల విన్యాసాలు, యువత ఉత్సాహం, సాంప్రదాయ కళారూపాలు, డప్పు చప్పుళ్లు, జయజయధ్వానాలతో అంబేద్కర్‌ చౌరస్తా సందడిగా మారింది. ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతుల ప్రదర్శనలు, వాటి విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సదర్‌ వేడుకలతో పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి హాజరయ్యారు. వారికి యాదవ సంఘం నాయకులు, సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దున్నపోతును ఆడిస్తూ వేడుకల్లో పాల్గొని అక్కడున్న వారిలో ఉత్సాహాన్ని నింపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సదర్‌ వేడుకలు కేవలం ఉత్సవాలు మాత్రమే కాదని, యాదవుల ఐక్యతకు, ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల వైభవానికి ప్రతీకలని పేర్కొన్నారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వాటి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేస్తూ సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.

యాదవ సోదరులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. సంప్రదాయాలను గౌరవిస్తూ యువత వాటి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి సైతం వేడుకల్లో పాల్గొని యువతలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొని సదర్‌ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.