BREAKING
thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక
Date of Publish : 06 October 2026, 06:51 pm
Posted by : KADARI RAMANA

అర్హులైన దివ్యంగులందరికీ సదరం పత్రాలు అందించాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

తెలంగాణ
Reporter
Kadari Ramana Nirmal Rural
06 Oct, 2026 - 06:51 PM
15 వీక్షణలు

అధికారులకు జిల్లా కలెక్టర్ భవిష్య ఆదేశం

నిర్మల్: జిల్లాలో అర్హులైన దివ్యాంగులందరికీ సదరం ధ్రువీకరణ పత్రాలు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవిష్య అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సదరం ధ్రువీకరణ పత్రాల జారీపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన సదరం శిబిరాలు, జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అర్హులైన దివ్యాంగులకు ఎప్పటికప్పుడు సదరం శిబిరాలు నిర్వహించి, పారదర్శకంగా ధ్రువీకరణ పత్రాలు అందించాలని కలెక్టర్ సూచించారు. సదరం ధ్రువీకరణ ప్రక్రియలో దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సదరం శిబిరాల వద్ద దివ్యాంగులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న దివ్యాంగులకు శిబిరాల నిర్వహణ తేదీ, సమయం తదితర వివరాలను ముందుగానే తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవిష్య సూచించారు.

ఈ సమావేశంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి సూపరింటెండెంట్ గోపాల్ సింగ్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.