BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 09:01 am
Posted by : బాల్ధా భాస్కర్

కొండమడుగులో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం, కార్తీక వన భోజనాలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
15 Nov, 2026 - 09:01 AM
89 వీక్షణలు

కార్తీక మాసం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. మానవ విలువలు, భగవద్గీత గొప్పతనంపై సత్సంగం

కొండమడుగు: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కొండమడుగు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉసిరి వృక్షం కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించడంతో పాటు కార్తీక వన భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

కార్తీక మాస ఆధ్యాత్మిక ప్రాధాన్యతను చాటిచెప్పేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భవాని శంకర్ సత్సంగం నిర్వహించారు. మానవ విలువలు, భగవద్గీత గొప్పతనం, మనిషి జీవితంలో ఆధ్యాత్మికత ప్రాధాన్యత వంటి అంశాలపై వివరించారు. భగవద్గీతలోని సందేశాలు మనిషికి జీవితంపై సరైన అవగాహన కల్పించడంతో పాటు ధర్మబద్ధంగా నడుచుకునేందుకు మార్గనిర్దేశం చేస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మానవీయ విలువలను అలవర్చుకుని సమాజంలో పరస్పర ప్రేమ, గౌరవం, సేవాభావంతో మెలగాలని సూచించారు.

అనంతరం భక్తులు, గ్రామస్తులు కలిసి కార్తీక వన భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భజన మండలి సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడెం పాండురంగం, ఉప సర్పంచ్ అరిగే శ్రీధర్, బీబీనగర్ మాజీ జెడ్పీటీసీ భాషబోయిన పెంటయ్య, మాజీ సర్పంచ్ శివగల్ల ఇస్తారి, కడెం లతారాజేష్ బాబు, మాజీ ఎంపీటీసీ దేశం ముత్యాలు గౌడ్, వాకిటి సంజీవరెడ్డి, దేవస్థాన కమిటీ చైర్మన్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్, కడెం సాయిలు, చింతల సుదర్శన్ రెడ్డి, శివరాం రెడ్డి, రాజమల్లేష్, రంగ సుదర్శన్ గౌడ్, గోపాల్ చారి, శివలక్ష్మి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.