BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 03 August 2026, 08:35 pm
Posted by : కూనురు మధు

​సుంకేనపల్లి లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Aug, 2026 - 08:35 PM
138 వీక్షణలు

​సుంకేనపల్లి లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు  

నల్గొండ జిల్లా చిట్యాల మండలం సుంకేనపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలు 1, 2 లలో సోమవారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ సందర్భంగా అంగన్‌వాడీ సిబ్బంది మాట్లాడుతూ తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో తల్లిపాలు ఎంతో కీలకమని వివరించారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తప్పనిసరిగా ముర్రు పాలు పట్టాలని పిలుపునిచ్చారు. తల్లిపాలు బిడ్డను అనేక రకాల వ్యాధుల నుండి కాపాడుతాయని, ముర్రు పాలు పిల్లల జీర్ణశయాన్నీ శుభ్రపరుస్తాయని తెలిపారు. తల్లి, బిడ్డల ఆరోగ్యమే సమాజానికి ముఖ్యాంశమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గర్భిణులు, బాలింతలు, పెద్దలు, పిల్లల తల్లులతో పాటు అంగన్‌వాడీ టీచర్లు ఎన్. భాగ్యమ్మ, ఎమ్. రజిత తదితరులు పాల్గొన్నారు.