BREAKING
thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం
Date of Publish : 06 October 2026, 03:14 pm
Posted by : NTODAY NEWS

నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
06 Oct, 2026 - 03:14 PM
6 వీక్షణలు

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి

ఎల్బీనగర్ / ఎన్ టుడే న్యూస్..

జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైతన్యపురి డివిజన్ పరిధిలోని న్యూ దిల్‌సుఖ్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో గత కొన్ని రోజులుగా నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ, బ్యూటీషియన్, మెహందీ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన మహిళా సోదరీమణులకు సర్టిఫికెట్లను ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ,ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి కమల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మహిళ చేతిలో నైపుణ్యం ఉంటే ఒక కుటుంబం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని, ఒక కుటుంబం ఎదిగితే సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు.

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలనే లక్ష్యంతో జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ శిక్షణలో ప్రాథమిక స్థాయి నుంచి ఆధునిక కుట్టు నైపుణ్యాలతో పాటు బ్యూటీషియన్, మెహందీ వంటి ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే కోర్సుల్లో సమగ్ర శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.

శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన మహిళలు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడంతో పాటు, తమ కుటుంబ ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేసుకునే అవకాశం పొందుతారని అన్నారు.

మహిళల నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, యువ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,ఎల్.బి.నగర్ నియోజకవర్గ భారస పార్టీ మహిళా అధ్యక్షురాలు రంగేశ్వరి నాయుడు,నర్సిరెడ్డి,రాపోలు సుధాకర్,విశ్వ ప్రేమ్,నాగలక్ష్మి,జయశ్రీ,శోభరాణి మరియు ట్రైనర్లు సునీత, భానుప్రియ, శివబిందు, అర్చన మరియు ట్రస్ట్ ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, శిక్షణ పొందిన మహిళలు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.