BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 12:55 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరిన చౌడేపల్లి సీనియర్ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Nov, 2026 - 12:55 PM
25 వీక్షణలు

మాజీ ఎంపీపీ రెడ్డి ప్రకాశ్, మాజీ సర్పంచ్ భరత్ వరుణ్‌తో పాటు అనుచరుల చేరిక

అన్నమయ్య జిల్లా | చౌడేపల్లి | ఎన్ టుడే న్యూస్

చౌడేపల్లి మండలానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. సీనియర్ నాయకుడు మునెప్ప, మాజీ ఎంపీపీ రెడ్డి ప్రకాశ్, మాజీ సర్పంచ్ భరత్ వరుణ్ తమ అనుచరులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు నాయకత్వం, ప్రజల కోసం ఆయన చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

మాజీ ఎంపీపీ రెడ్డి ప్రకాశ్, మాజీ సర్పంచ్ భరత్ వరుణ్‌తో పాటు వారి అనుచరులు టీడీపీలో చేరడం పుంగనూరు నియోజకవర్గంలో పార్టీకి బలం చేకూర్చిందని టీడీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ చేరికతో చౌడేపల్లి మండలంలో పార్టీ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని వారు పేర్కొన్నారు.

— టీడీపీ కార్యాలయం, పుంగనూరు