కొణిజర్ల అంగన్వాడీ కేంద్రంలో సేవా సంకల్ప్ అభియాన్
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం సేవా సంకల్ప్ అభియాన్, అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ శివకుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, పూర్వ ప్రాథమిక విద్య, ప్రధానమంత్రి మాతృ వందన యోజన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను గ్రామస్థులకు వివరించారు.
అంగన్వాడీ కార్యకర్తలు సమత, అంజమ్మ, కాంతకుమారి, ఏఎన్‌ఎం నాగమణి సేవలను గుర్తించిన గ్రామ మహిళలు వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శి సుజాత, మహిళలు, ఆశా కార్యకర్తలు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.