BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 11:16 am
Posted by : NAGARAJU GADE

గరికిపాడులో వైఎస్సార్‌సీపీకి షాక్‌.. టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్ యడ్ల రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
15 Nov, 2026 - 11:16 AM
227 వీక్షణలు

మాజీ సర్పంచ్‌తో పాటు పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక.. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన కొల్ల అప్పలనాయుడు

సంతకవిటి, నవంబర్ 15: విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గరికిపాడు గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నాయకులు, కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామ మాజీ సర్పంచ్ యడ్ల రామకృష్ణ, యడ్ల మురళీకృష్ణ, యడ్ల గౌరునాయుడుతో పాటు గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం మామిడిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కొల్ల అప్పలనాయుడు, సంతకవిటి మండల ఎంపీపీ అభ్యర్థి కొల్ల యశస్సు, మండల పార్టీ అధ్యక్షుడు గట్టి భాను నూతనంగా పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ యడ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో తమ గ్రామానికి, గ్రామ ప్రజలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, కొల్ల అప్పలనాయుడు చేపడుతున్న కార్యక్రమాలు తమను ఆకర్షించాయని తెలిపారు. వారి నాయకత్వంపై నమ్మకంతోనే తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

గ్రామస్థాయిలో పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఈ చేరికలు జరిగాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.