వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి..
తెలంగాణ
/
నల్గొండ
/
మునుగోడు
గోగు వెంకటేశ్వర్లుకు ఉత్తమ అవార్డు
యాదాద్రి భువనగిరి: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వృద్ధుల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన గోగు వెంకటేశ్వర్లుకు ఉత్తమ అవార్డు అందజేశారు.
జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమం కోసం పనిచేస్తూ, అధిక సంఖ్యలో వృద్ధుల సంఘాలను ఏర్పాటు చేయడంలో ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా డీఆర్డీవో నాగిరెడ్డి, సెర్ప్ సదరం పీఎం శైలజ చేతుల మీదుగా గోగు వెంకటేశ్వర్లు అవార్డును అందుకున్నారు. వయోవృద్ధుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం మరింతగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.