BREAKING
thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ
Test 4
Date of Publish : 05 October 2026, 10:26 am
Posted by : SEETHA KIRAN KUMAR

నోయిడాలో 43వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
05 Oct, 2026 - 10:26 AM
194 వీక్షణలు

నోయిడా: నోయిడాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సంభవ్ జైన్ 43వ అంతస్తు నుంచి దూకి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. కుటుంబ, వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంభవ్ జైన్‌కు 2023లో వివాహం కాగా, ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం. 2025లో భార్యతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. విడాకుల అనంతరం భరణం కింద భార్యకు రూ.3 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఇందులో ఇప్పటికే రూ.1 కోటి చెల్లించినట్లు పేర్కొన్నారు.

మిగిలిన రూ.2 కోట్ల భరణం చెల్లించాల్సి ఉండటంతో సంభవ్ జైన్ ఆర్థిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను మరణిస్తే కుటుంబంపై ఆర్థిక భారం ఉండదనే ఆలోచనతో ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణాలను పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడించాల్సి ఉంది.

ఆత్మహత్యకు ముందు సంభవ్ జైన్ తన తండ్రికి ఓ సందేశం పంపినట్లు సమాచారం. అందులో “నాన్నా.. ఇక మీరు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నట్లు కుటుంబ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంభవ్ జైన్ మృతికి దారితీసిన పరిస్థితులు, భరణం వ్యవహారం, చివరి సందేశానికి సంబంధించిన అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.