BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 05:35 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బంగారు ఆభరణాల్లో రేనియం పౌడర్ కల్తీ? కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
18 Nov, 2026 - 05:35 PM
11 వీక్షణలు

బరువు పెంచేందుకు చైనా నుంచి దిగుమతి.. సాధారణ పరీక్షల్లో గుర్తించడం కష్టమంటూ కథనం

హైదరాబాద్: బంగారు ఆభరణాల తయారీలో ‘రేనియం’ పేరుతో చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న పౌడర్‌ను కలిపి మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. తక్కువ ధరకు లభించే ఈ పౌడర్‌ను బంగారంలో కలపడం ద్వారా స్వచ్ఛత తగ్గినా ఆభరణాల బరువు పెంచుతున్నట్లు సమాచారం.

ముంబై, అహ్మదాబాద్, జైపూర్ వంటి నగరాల్లో ఈ పౌడర్‌ను ఉపయోగిస్తున్నట్లు దైనిక్ భాస్కర్ ప్రచురించిన కథనం వెల్లడించింది. ఈ విధానం ద్వారా బంగారం స్వచ్ఛతను తగ్గించి, అధిక బరువుతో ఆభరణాలను విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు, సాధారణ XRF యంత్రాలు, హాల్‌మార్క్ కేంద్రాల్లో నిర్వహించే పరీక్షల్లోనూ ఈ తరహా కల్తీని గుర్తించడం కష్టమవుతోందని సదరు కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.