కనిగిరిలో SP కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు
కనిగిరి (ఎన్ టుడే న్యూస్): కనిగిరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా బుధవారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేశారు.
పోలింగ్ కేంద్రాలతోపాటు ఎనిమిది స్ట్రాంగ్ రూమ్లు, ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ.. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, నిబంధనలను పక్కాగా అమలు చేయాలని సూచించారు.