BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 04:17 am
Posted by : K MAHESH

మునిపంపులలో బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 04:17 AM
19 వీక్షణలు

విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి.. విద్యార్థుల హాజరు పెంచి డ్రాపౌట్స్ తగ్గించేందుకు చర్యలు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

యాదాద్రి జిల్లా, రామన్నపేట: బాలల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టే లక్ష్యంతో మునిపంపుల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బాలల ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

ఈ ప్రత్యేక గ్రామసభలో గ్రామంలోని బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారం తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. పిల్లల అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలపై సమీక్షించారు. బాలలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి అవసరాలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి బాలబాలికకు కనీస అవసరాలు కల్పించి, వారి సమగ్ర అభివృద్ధికి గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పిల్లలకు మెరుగైన వసతులు, అవకాశాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు మధ్యలో చదువు మానేసే వారి సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పిల్లల్లో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాలల సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపడం ద్వారా వారికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చన్నారు.

బాలలకు మెరుగైన భవిష్యత్తును అందించడం ఒక్కరి బాధ్యత కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులందరూ సమష్టిగా కృషి చేయాలని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతి చిన్నారి విద్యావంతుడిగా, ఆరోగ్యవంతుడిగా ఎదిగేలా గ్రామ పంచాయతీ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొడ్డి స్వామి, ధర్మేందర్, పంచాయతీ కార్యదర్శి రచ్చ వేణు, పాలకవర్గ సభ్యులు యాదాసు లక్ష్మణ్, నీల రజిత, అంగన్‌వాడీ టీచర్లు మంజుల, ఏలూరు అనిత, యాదాసు శోభ, ఆశా వర్కర్లు గాదె అలివేల, మామిండ్ల లక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ జంపాల అనిత, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.