ఊరుమడ్లలో గణనాథుడికి ప్రత్యేక పూజలు
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో కంచర్ల భూపాల్ రెడ్డి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సాగర్ల గంగరాజు, దోటి భిక్షం, పురుషోత్తం, నాగరాజు, బి. సైదులు, వినోద్, జె. ప్రవీణ్, బోయ వెంకన్న, మల్లేష్‌తో పాటు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.