BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 08:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 08:39 PM
17 వీక్షణలు

 నేటి నుంచే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఉన్నత విద్యాశాఖ శుభవార్త అందించింది. OAMDC–2026 ప్రవేశాల ప్రక్రియలో భాగంగా స్పాట్ అడ్మిషన్లు, మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు సంబంధించి కమిషనరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే నిర్వహించిన ప్రవేశాల ప్రక్రియ అనంతరం వివిధ కళాశాలల్లో మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. అదేవిధంగా మేనేజ్‌మెంట్ కోటా కింద ఖాళీగా ఉన్న సీట్లకు కూడా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ప్రవేశాల ప్రక్రియ నవంబర్ 17, 2026 నుంచి ప్రారంభం కానుంది. డిగ్రీలో ప్రవేశం పొందాలనుకునే అర్హులైన విద్యార్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, నిబంధనలు, ప్రవేశాల షెడ్యూల్‌ను పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు, కళాశాలల వారీగా సీట్ల సమాచారం, ప్రవేశాల షెడ్యూల్ కోసం OAMDC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఉన్నత విద్యాశాఖ సూచించింది. ఇప్పటికే ప్రవేశాలు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.