BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 04:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర చిన్నారుల నృత్య ప్రతిభకు రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Nov, 2026 - 04:18 PM
26 వీక్షణలు

318 బృందాల పోటీలో సత్తా చాటిన కళాసాధన నృత్య కళా నికేతన్ విద్యార్థులు వేంకటేశ్వరుని నృత్య రూపకానికి అగ్రస్థానం.. చిన్నారుల ప్రతిభకు అధికారుల ప్రశంసలు మధిర: రాష్ట్రస్థాయి బాలోత్సవ్ పోటీలలో మధిర పట్టణానికి చెందిన కళాసాధన నృత్య కళా నికేతన్ చిన్నారులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 318 నృత్య బృందాలు పాల్గొన్నాయి. ఇంతటి పోటీలో మధిర చిన్నారులు ప్రదర్శించిన వేంకటేశ్వరుని నృత్య రూపకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుంది. తమ నృత్య ప్రదర్శనతో ఇతర బృందాలకు దీటుగా నిలిచిన చిన్నారులు ప్రథమ స్థానాన్ని సాధించి మధిర పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. రాష్ట్రస్థాయి వేదికపై చిన్నారులు కనబరిచిన ప్రతిభ పట్ల మధిర మండల అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు నృత్యంలో శిక్షణ అందించి ఈ విజయానికి బాటలు వేసిన కళాసాధన నృత్య కళా నికేతన్ నిర్వాహకులు కళ్యాణపు నాగరాజు, సింధుతో పాటు నృత్య గురువులు అమృత వర్షిణి, విజేతల తల్లిదండ్రులను కూడా అభినందించారు. చిన్న వయసులోనే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటుకుని ప్రథమ బహుమతి సాధించడం మధిర పట్టణానికి గర్వకారణమని పలువురు ప్రశంసించారు.