BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నాగులగుట్టపల్లి పాఠశాలలో వీధి కుక్కల దాడి..

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 10:52 PM
18 వీక్షణలు

తొమ్మిదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు కడప జిల్లా చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. పాఠశాల ఆవరణలోకి ప్రవేశించిన కుక్కలు మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల విద్యార్థి నందకిషోర్‌పై దాడి చేయడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నాగచైతన్య పాఠశాలలో చదువుతున్న నందకిషోర్ వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా వీధి కుక్కలు అతడిపై విరుచుకుపడ్డాయి. కుక్కల దాడిలో బాలుడి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో పాఠశాలలో భయాందోళన నెలకొంది. చిన్నమిన్నయ్యగారిపల్లికి చెందిన గంగిరెడ్డి, స్వాతి దంపతుల కుమారుడైన నందకిషోర్‌ను వెంటనే వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు పంపించారు. విద్యార్థులు చదువుకునే పాఠశాల ఆవరణలోకి వీధి కుక్కలు ప్రవేశించి చిన్నారిపై దాడి చేయడం పాఠశాల భద్రతా ఏర్పాట్లపై ఆందోళన కలిగిస్తోంది. పాఠశాల ప్రాంగణంలోకి కుక్కలు ఎలా ప్రవేశించాయి, వాటిని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదనే అంశాలపై తల్లిదండ్రులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆవరణలోకి వీధి కుక్కలు ప్రవేశించకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. చిన్నారుల ప్రాణాలకు ముప్పు కలగకుండా పాఠశాల యాజమాన్యాలు, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.