BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 06:37 pm
Posted by : K MAHESH

విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధన

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 06:37 PM
13 వీక్షణలు

స్వయం పరిపాలన దినోత్సవంలో వివిధ హోదాల్లో బాధ్యతలు చేపట్టిన 38 మంది విద్యార్థులు

దంతాలపల్లి, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమలోని బోధనా నైపుణ్యాలను ప్రదర్శించారు.

పాఠశాలకు చెందిన 38 మంది విద్యార్థినీ విద్యార్థులు వివిధ హోదాల్లో బాధ్యతలు చేపట్టి ఉపాధ్యాయులు, పాఠశాల పరిపాలనా అధికారులుగా వ్యవహరించారు. ప్రధానోపాధ్యాయుడిగా ఎం. కుమారస్వామి, ఆర్జేడీగా పి. నిఖిత, డీఈఓగా పంతం పార్ధు, ఎంఈఓగా పి. ఉమామహేశ్వరి తదితరులు బాధ్యతలు నిర్వహించారు. ఆయా హోదాల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. వేణు మాధవ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయురాలు ఏ. శ్రీదేవి, స్టాఫ్ సెక్రటరీ టి. సురేందర్ గుప్తా, బి. రవి చందర్, టి. మంజుల, ఆర్. వేణుగోపాల్‌తో పాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.