BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 09:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను గ్రంథాలయంలో కవుల చిత్రపటాలతో విద్యార్థుల ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 09:23 PM
17 వీక్షణలు

అక్షరాలే ఆయుధాలుగా సమాజాన్ని చైతన్యపరిచిన మహనీయులు ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యార్థులు కవుల చిత్రపటాలతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. వాల్మీకి మహర్షి, వేమన, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గుర్రం జాషువా, శ్రీశ్రీ, ఆరుద్ర తదితర ప్రముఖ కవుల చిత్రపటాలను చేతబట్టి గ్రామంలో ప్రదర్శన చేపట్టారు. కవులు వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ సాహితీవేత్తల సేవలను స్మరించుకున్నారు. అనంతరం గ్రంథాలయ నిర్వాహకులు తెనాలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా శిరిడీ సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు ఊటుకూరు నారాయణరావు మాట్లాడుతూ కవులు తమ అక్షరాలను ఆయుధాలుగా మలిచి సమాజంలోని కులవివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలపై తమ రచనల ద్వారా పోరాటం సాగించారని తెలిపారు. ప్రజల్లో సామాజిక చైతన్యం కలిగించడంలో కవులు, రచయితల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. వారి రచనలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని అన్నారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల పాత్ర అనే అంశంపై చర్చా పోటీలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన నిమ్మకాయలతో చెంచా పరుగు పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.