BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 07:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను పాఠశాల విద్యార్థులకు యోగాలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Nov, 2026 - 07:17 PM
50 వీక్షణలు

ఉమ్మడి కృష్ణా జిల్లా పోటీల్లో సత్తా చాటిన ఇద్దరు విద్యార్థులు 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు యోగాసనాల పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 7వ తేదీన పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్‌-17 విభాగంలో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి యోగా పోటీల్లో పెనుగొలను పాఠశాలకు చెందిన మారేపోగు సిద్ధార్థ, గట్టి గుండె సాత్విక్ ప్రతిభ చాటారు. వీరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 20వ తేదీన శ్రీకాకుళంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ఇద్దరూ పాల్గొననున్నట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం. అంజయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీకాకుళం వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చుల నిమిత్తం పాఠశాల పూర్వ విద్యార్థి, షిరిడీ సాయిబాబా సేవా కమిటీ నిర్వాహకుడు పరుచూరి హరి మాధవ గుప్తా రూ.2,116 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. దుర్గాప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఊటుకూరు వెంకట రామారావు, పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ ఆదూరి ఆంజనేయులు, సంఘం కమిటీ సభ్యులు దేవర వెంకటేశ్వర్లు, కిషోర్, తొండపు నాగేశ్వరరావు, షిరిడీ సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు ఊటుకూరు నారాయణరావు, కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.