BREAKING
thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● కొత్త ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● సూరారంలో కాలుష్యంపై రైతుల ఆవేదన thumb ● బనగానపల్లె ఆసుపత్రిలో గర్భిణీలకు పోషకాహారం పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● కొత్త ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● సూరారంలో కాలుష్యంపై రైతుల ఆవేదన thumb ● బనగానపల్లె ఆసుపత్రిలో గర్భిణీలకు పోషకాహారం పంపిణీ
Date of Publish : 01 October 2026, 01:54 pm
Posted by : BOYA SWAMY

సుదర్శన క్రియ, యోగ, ధ్యానం విద్యార్థుల విజయానికి పునాది

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
Reporter
Boya Swamy Chityala Mandal
01 Oct, 2026 - 01:54 PM
12 వీక్షణలు

చిట్యాల, అక్టోబర్ 1: ప్రతిరోజూ సుదర్శన క్రియ, యోగ, ధ్యానం సాధన చేయడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెంపొందుతాయని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్, టీచర్ పల్లపు బుద్ధుడు తెలిపారు.

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని ప్రభుత్వ హాస్టల్‌లో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించిన హ్యాపీనెస్ కోర్స్ ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు షార్ట్ సుదర్శన క్రియ, యోగ, ధ్యాన సాధనలను నిర్వహించారు.

ఈ సందర్భంగా పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ విద్యార్థుల్లో శారీరక, మానసిక సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు ఏకాగ్రత, సానుకూల ఆలోచనా విధానం, ఆత్మవిశ్వాసం పెరిగేలా యోగాసనాలు, సూర్యనమస్కారాలు, పద్మసాధన, త్రీ స్టేజ్ ప్రాణాయామం, భస్త్రిక, ధ్యాన సాధనలను బోధిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

శ్రీశ్రీ రవిశంకర్ సూచించిన సుదర్శన క్రియ సాధన ద్వారా అంతర్గత ప్రశాంతతను పెంపొందించుకోవచ్చని తెలిపారు. శాంతియుత సమాజ నిర్మాణానికి ధ్యానం, సేవాభావం, మానవీయ విలువలను అలవర్చుకోవాలని సూచించారు.

హ్యాపీనెస్ కోర్సులో పాల్గొన్న విద్యార్థులకు కార్యక్రమం ముగింపులో ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఐదు రోజులపాటు క్రమశిక్షణతో యోగ, సుదర్శన క్రియ, ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. గ్రామంలోని యువత, విద్యార్థుల కోసం ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు.

కార్యక్రమంలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ పల్లపు బుద్ధుడు, హాస్టల్ వార్డెన్ ధర్మపురి తార, హాస్టల్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.